Share News

రాఘవేంద్రుడి సన్నిధిలో కర్ణాటక న్యాయమూర్తులు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:11 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జ్జి జస్టిస్‌ ఇంద్రేష్‌, జస్టిస్‌ శ్రీశానంద శనివారం కుటుంబ సమేతంగా వేర్వేరు సమయాల్లో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

రాఘవేంద్రుడి సన్నిధిలో కర్ణాటక న్యాయమూర్తులు
రాఘవేంద్రుడి సన్నిధిలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఇంద్రేష్‌

మంత్రాలయం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి) : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటక రాష్ట్ర హైకోర్టు జడ్జ్జి జస్టిస్‌ ఇంద్రేష్‌, జస్టిస్‌ శ్రీశానంద శనివారం కుటుంబ సమేతంగా వేర్వేరు సమయాల్లో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మహాముఖ ద్వారం వద్ద మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌ కే శ్రీనివాసరావు, వెంటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి వీరికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే అనంతపురం ఎంపీ అంబిక లక్షీనారాయణ, విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణబ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ హరీష్‌ బేత స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌, సత్యజయకృష్ణ, ప్రహ్లాదాచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు వెంకట్‌, కీర్తన, అరుణ్‌కుమర్‌, శ్వేత, టీడీపీ నాయకులు పల్లిపాడు రామిరెడ్డి, సురేష్‌నాయుడు, వరదరాజులు, చాపలనగేష్‌, డీసీ తిమ్మప్ప, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:11 AM