Share News

రైతును ముంచిన కలింగర

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:57 PM

ఈ ఫొటోలో ఉన్న రైతు మదనంతపురం గ్రామానికి చెందిన ఎ.మల్లారెడ్డి. రెండున్నర ఎకరాల్లో కలింగర సాగుచేశాడు. 20 టన్నుల దిగుబడి మాత్రమే రావడం. ధర కూడా లేకపోవడంతో రూ.1.5లక్షల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు..

రైతును ముంచిన కలింగర

తగ్గిన దిగుబడి .. పడిపోయిన ధర

తీవ్ర నష్టాల్లో అన్నదాతలు

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మధనంతపురం గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో రైతులు కలింగరను సాగు చేశారు. దిగుబడి బాగా వచ్చి అప్పుల నుంచి గట్టెకుత్కామని ఆశించారు. ఎకరాకు రూ.2.50లక్షల పెట్టుబడి పెట్టారు.

తెగుళ్ల బెడదతో తగ్గిన దిగుబడి

పంటను ఆకు తెగులు ఆశించడంతో దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 20 నుంచి 25 టన్నుల కాయలు రావాల్సివుండగా కేవలం పది టన్నులు రావడంతో ఏమిచేయాలో తెలియడం లేదని వాపోతున్నారు.

పడిపోయిన ధరలతో నిరాశ

అసలే దిగుబడి తక్కువగా వచ్చిన రైతులు మార్కెట్‌లో కలింగర పండ్లకు ధర పడిపోవడంతో నిరాశ చెందారు. గతేడాది టన్ను రూ.10, 15వేలు అమ్మగా, ప్రస్తుతం టన్ను రూ.3, 5వేలు మించి పలకడంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. దీంతో భారీగా నష్టం వచ్చిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:57 PM