Share News

కైరుప్పల జనసంద్రం

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:47 PM

భద్రకాళి, వీరభద్రస్వామి ఉత్సవాల నేపథ్యంలో ఆ స్పరి మండలంలోని కైరుప్పల గ్రామం జన సంద్రంగా మారింది.

కైరుప్పల జనసంద్రం
జనసందోహం నడుమ కొనసాగుతున్న వీరభద్రస్వామి రథోత్సవం

ఘనంగా వీరభద్రస్వామి రథోత్సవం

ఆస్పరి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): భద్రకాళి, వీరభద్రస్వామి ఉత్సవాల నేపథ్యంలో ఆ స్పరి మండలంలోని కైరుప్పల గ్రామం జన సంద్రంగా మారింది. సోమవారం వీరభద్ర స్వామి రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివ చ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్ర మాలు నిర్వహించారు. సాయంత్రం భద్రకాళి, వీరభద్రస్వామిల ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గ్రామ ప్రధాన వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, శశికళ పాల్గొని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ప్రధాన వీధి నుంచి బసవన్నకట్ట వరకు లాగారు. తిరిగి రథాన్ని యథా స్థానానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వరప్రసాద్‌బాబు, శశిరెడ్డి, జీకే వీరేష్‌, పుట్టా వీరేష్‌, ఉరుకుందు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:47 PM