Share News

హోరాహోరీగా బాలికల అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:40 AM

పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ మైదానంలో మంగళవారం జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు 4వ రోజు రసవత్తరంగా సాగాయి

హోరాహోరీగా బాలికల అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు
కబడ్డీ పోటీల్లో పాల్గొన్న బాలికలు

నంద్యాల హాస్పిటల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ మైదానంలో మంగళవారం జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు 4వ రోజు రసవత్తరంగా సాగాయి. హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం బాలురకు బాస్కెట్‌ బాల్‌, కబడ్డీ, బాక్సింగ్‌, ఖోఖో, ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 300ల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎంఎన్‌వి రాజు మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో గెలుపొందిన క్రీడాకారులకు నంద్యాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. చివరి రోజు 13న బ్యాడ్మింటన్‌, హకీ, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 13 , 2026 | 12:41 AM