Share News

జువైనల్‌ హోమ్‌ తనిఖీ

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:12 AM

స్థానిక బి.క్యాంపు లోని అబ్జర్వేషన హోమ్‌ ఫర్‌ బాయ్స్‌ను బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తనిఖీ చేశారు.

జువైనల్‌ హోమ్‌ తనిఖీ
రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, జూన 17(ఆంధ్రజ్యోతి): స్థానిక బి.క్యాంపు లోని అబ్జర్వేషన హోమ్‌ ఫర్‌ బాయ్స్‌ను బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. అక్కడ ఉంటున్న బాలలకు అవసరమైన న్యాయ సహా యాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అనంతరం జువైన ల్‌ జస్టిస్‌ బోర్డు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సంస్థలు బాలల సంక్షేమం గురించి తీసు కుం టున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అబ్జర్వేషన ఫర్‌ హోమ్‌ ఫర్‌ బాయ్స్‌ సూపరింటెండెంట్‌ హుశేనబాషా, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స కౌన్సిల్‌ శివరామచంద్రరావు, సులోచన, డీపీవో దివాకర్‌, సీడబ్ల్యూసీ చైర్మన జుబేదా బేగం పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:12 AM