టీడీపీతోనే రాయలసీమకు న్యాయం
ABN , Publish Date - May 04 , 2026 | 12:14 AM
తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాయలసీమకు న్యాయం చేకూరిందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని బిజనవేముల గ్రామంలో మంత్రి పర్యటించారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫ బిజినవేముల గ్రామంలో అధివృద్ధి పనులు ప్రారంభం
కోవెలకుంట్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాయలసీమకు న్యాయం చేకూరిందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని బిజనవేముల గ్రామంలో మంత్రి పర్యటించారు. రూ 8లక్షల సొంత నిధులతో నిర్మించిన ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను, రూ 35లక్షలతో నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌ను, బీసీ కాలనీలో రూ 30లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఎం.గోవిందిన్నె గ్రామ మెట్ట నుంచి గ్రామంలోకి రూ 2కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తోందని, ఇందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును, జిఎన్‌ఎస్‌ఎస్ పూర్తి చేయడంతో పాటు రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 2009 నుంచి 2014 వరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ఎంత అభివృద్ది చేశారో, 2014 నుంచి 2019 వరకు తాను ఎంత అభివృద్ధి చేశానో, బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. పింఛన్‌ను రూ 4వేలకు పెంచామని, రూ 20వేలు రైతు భరోసా, టీచర్ ఉద్యోగాలు, స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. కోవెలకుంట్ల మండలంలో ఓ నాయకునికి ప్రజలు అధికారం కట్టబెడితే అభివృద్ది చేయకుండా సాకులు చెప్తూ పనులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతోనే తాను మంత్రిని అయ్యాయనానరు. పంచాయతీ రాజ్ డీఈ నాగ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మధుసూదన్, ఎంపీడీవో వర ప్రసాదరావు, తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డ్డి, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడు, టీడీపీ నాయకులు గజ్జల హుస్సేనయ్య, రాధాకృష్ణ, పెద్ద హుస్సేనయ్య, మనోహర్, వెలగటూరు ధనుంజయుడు, సుబ్బరాయుడు, షరీఫ్, గడ్డం నాగేశ్వర్ రెడ్డి, కలుగొట్ల అర్జున్ రెడ్డి, రేవనూరు నరసింహ రెడ్డి, వల్లంపాడు జగదీశ్వర్ రెడ్డి, అమడాల మద్దిలేటి పాల్గొన్నారు.