Share News

మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:17 PM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ జడ్జి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి దర్శించుకు న్నారు.

మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి
జడ్జికి స్వాగతం పలుకుతున్న ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ జడ్జి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి దర్శించుకు న్నారు. శుక్రవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు వేదపండితులతో కలిసి స్వాగతం పలికారు. ఆయన ప్రధాన ధ్వజస్తంభ నమస్కారం చేసుకున్నాక స్వామి వారికి పంచామృతాభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతాలయాలను దర్శించుకున్నారు. వేద పండితులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారిని ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

Updated Date - Jun 26 , 2026 | 11:17 PM