Share News

కూటమి పాలనలోనే దళితులకు న్యాయం

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:02 AM

అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చే కూటమి పాలనలోనే దళితులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌. జవహర్‌ అన్నారు.

కూటమి పాలనలోనే దళితులకు న్యాయం
అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న కె.ఎస్‌.జవహర్‌, టీడీపీ నాయకులు ఎన్‌. రాఘవేంద్రరెడ్డి, పి.తిక్కారెడ్డి

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌. జవహర్‌

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

నీలి జెండాలతో భారీ ఊరేగింపు

కోసిగి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చే కూటమి పాలనలోనే దళితులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌. జవహర్‌ అన్నారు. కోసిగి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మండలంలోని వివిధ ప్రాం తాల నుంచి ప్రజలు నీలి జెండాలతో ఊరేగింపుగా పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో కలశాలు పట్టుకుని నడిచారు. ప్రజాప్రతి నిధులు, యువత, విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కె.ఎస్‌. జవహర్‌ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అంబే డ్కర్‌ విగ్రహం సమాన హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆయన చూపిన మార్గంలో కూటమి ప్రభుత్వం దళితు లకు న్యాయం చేస్తోందని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభు త్వంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణం మధ్యలోనే నిలిచిపో యిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రత్యేక చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటు పూర్తి కావడాని కి శాయశక్తులా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి పి.తిక్కారెడ్డి, మాజీ సర్పంచ్‌ ముత్తురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లెపాడు రామి రెడ్డి, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నర్సారెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్‌ అయ్య న్న తదితరులు పాల్గొన్నారు. ఆదోని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ మధుసూద న్‌రెడ్డి, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, కోసిగి తహసీల్దార్‌ వేణుగోపాల్‌, కోసిగి సీఐ మంజునాథ్‌, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:02 AM