టీడీపీ ఖాతాలోకి జూపాడుబంగ్లా ఎంపీపీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:15 PM
స్థానిక ఎంపీపీ పదవి టీడీపీ ఖాతా ల్లోకి వచ్చి చేరింది. వైసీపీకి చెందిన ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీ మద్దతుదారులు గద్దె దించారు.
నీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక
జూపాడుబంగ్లా, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):స్థానిక ఎంపీపీ పదవి టీడీపీ ఖాతా ల్లోకి వచ్చి చేరింది. వైసీపీకి చెందిన ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీ మద్దతుదారులు గద్దె దించారు. ఎంపీటీసీ నీలమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఎన్నికల అధికారి నాగరాజరావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఏడుగురు ఎంపీటీలకుగాను ఎంపీపీగా ఒకరే నామినేషన్ వేయగా నీలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె ఎన్నికను ఎన్నికల అధికారి ధ్రువీకరించి ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మె ల్యే జయసూర్య హాజరయ్యారు. ఆయన సమక్షంలో ఎన్నికల అధికారి ఎంపీపీగా నీలమ్మతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఎంపీపీగా ఎన్నికైన నీలమ్మకు శుభాకాంక్షలు తెలిపి మండల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సూచించారు. ఎంపీడీవో గోపి కృష్ణ, మండల కన్వీనర్ మోహన్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు మాండ్రసురేంద్రనాథరెడ్డి, శ్రీనివాసులు, పరమేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, జంగాలపెద్దన్న, రమణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సుధాకర్, ప్రసన్నలక్ష్మీ, నాగిరెడ్డి పాల్గొన్నారు.