Share News

జూడాల సమ్మె ఉధృతం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:48 PM

స్టైఫండ్‌ పెంచాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్‌ తెలిపారు.

జూడాల సమ్మె ఉధృతం
రిలే దీక్షలో కూర్చున్న జూనియర్‌ డాక్టర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్టైఫండ్‌ పెంచాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్‌ తెలిపారు. హౌస్‌ సర్జన్లు, పీజీలు, సూపర్‌ స్పెషాలిటీల పీజీలు, సీనియర్‌ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారని తెలిపారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా దశలవారిగా ఆందోళనలు చేస్తున్నామని, మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5గంటలోగా ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక స్పందన అందకపోవడంతో ఫేజ్‌-3 ఆందోళనలో భాగంగా అత్యవసర సేవలను నిలిపివేసి సమ్మెను ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 11:48 PM