జూడాల సమ్మె
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:02 AM
ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది.
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా గురువారం ఆసుపత్రిలోని ఓల్డ్ సీఎల్‌జీ నుంచి కర్నూలు మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పరిపాలన భవనం ఎదుట మానవహారం నిర్వహించారు. జూడాల సంఘం అధ్యక్షుడు డా.జె.నిషాంత్ మాట్లాడుతూ తమకు స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని కోరుతున్నామని, ప్రభుత్వం కేవలం 3 శాతం పెంచుతామని చెప్పడం అన్యాయమని అన్నారు.
సమ్మె విరణమపై ఆలోచన చేయండి
రోగులు, సర్వీసు ఫీజుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమణపై ఒక నిర్ణయం తీసుకోవాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ జూడాలకు సూచించారు. మానవహారం నిర్వహించిన అనంతరం జూనియర్ డాక్టర్లు ప్రిన్సిపాల్‌కు కలిని వినతి పత్రం అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రోగుల ఆరోగ్య విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, సీనియర్ వైద్య విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు ఉన్నాయని గుర్తు చేశారు.