Share News

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:31 PM

జూనియర్‌ డాక్టర్లు బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌, రాజ్‌విహార్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న జూడాలు

కొనసాగుతున్న జూడాల సమ్మె

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ డాక్టర్లు బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌, రాజ్‌విహార్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూడాల సంఘం అధ్యక్షుడు డా. నిశాంత్‌ మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. తమ సేవలను గుర్తించి స్టైఫండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. అనాటమి డిపార్టుమెంట్‌లో నాన్‌ క్లీనికల్‌ కింద ఎంఎ్‌సపీ పీహెచ్‌డీ చేసిన ఇద్దరిని క్లీనికల్‌ డిపార్టుమెంట్‌ కింద విధుల్లో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఎంఎ్‌ససీ పీహెచ్‌డీ చేసిన వారిని క్లీనికల్‌ కింద విధుల్లో తీసుకోవడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి జూనియర్‌ డాక్టర్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్‌ సీఎల్‌జీ ఎదుట క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

ఓపీకి 3,267 మంది రోగులు:

జూనియర్‌ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఓపీ విభాగానికి 3,267 మంది రోగులకు అవసరమైన సేవలందించగా.. 191 మంది అడ్మిషన్‌ కాగా, 184 మంది డిశ్చార్జ్‌ పొందినట్లు వెల్లడించారు. మేజర్‌, మైనర్‌ కలిపి 252 ఆపరేషన్లు, 22 కాన్పులు జరిగినట్లు తెలిపారు.

Updated Date - Aug 19 , 2026 | 11:31 PM