Share News

21 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

ABN , Publish Date - May 12 , 2026 | 12:25 AM

కారుణ్య నియామ కాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇస్తూ కలెక్టర్‌ డా.ఏ. సిరి అభ్యర్థులకు నియామక ఉత్త ర్వులు అందజేశారు.

21 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు
అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేస్తున్న కలెక్టర్‌ ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, మే 11(ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామ కాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇస్తూ కలెక్టర్‌ డా.ఏ. సిరి అభ్యర్థులకు నియామక ఉత్త ర్వులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటో రియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల కు కలెక్టర్‌ నియామక ఉత్తర్వులును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు జీవి తంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఉద్యోగ నిధులను బాధ్యతాయు తంగా నిర్వర్తించి ప్రజలకు మంచి చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సునీత, రామసుబ్బయ్య, సెక్షన సిబ్బది సనా పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:25 AM