Share News

వాయిదా పడ్డ నల్లమల జంగిల్‌ సఫారీ ప్రారంభం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:20 AM

ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని వెలుగోడు రేంజ్‌లో బుధవారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా నల్లమల జంగిల్‌ సఫారీ వర్చువల్‌గా ప్రారంభం కావాల్సి ఉండగా..వాయిదా పడింది.

వాయిదా పడ్డ నల్లమల   జంగిల్‌ సఫారీ ప్రారంభం
ప్రారంభం కాని వెలుగోడులోని జంగిల్‌ సఫారీ

ఆత్మకూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని వెలుగోడు రేంజ్‌లో బుధవారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా నల్లమల జంగిల్‌ సఫారీ వర్చువల్‌గా ప్రారంభం కావాల్సి ఉండగా..వాయిదా పడింది. రాష్ట్రస్థాయిలో ప్రపంచ పులుల దినోత్సవాన్ని గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హాజరై అక్కడి నుంచే వెలుగోడు రేంజ్‌లోని నల్లమల జంగిల్‌ సఫారీని వర్చ్‌వల్‌గా ప్రారంభించాలని అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అనివార్య కారణల వల్ల కార్యక్రమానికి హాజరు కాకపోవడం వల్ల వెలుగోడు రేంజ్‌లోని జంగిల్‌ సఫారీ వర్చ్‌వల్‌ ప్రారంభం కూడా వాయిదా పడింది. దీంతో ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:20 AM