ముగిసిన 13వ జేఎన్‌టీయూఏ క్రీడలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:57 AM
ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజలులుగా జరుగుతున్న 13వ జేఎన్‌టీయూఏ అంతర్ కళాశాలల క్రీడలు సోమవారం ముగిశాయి. ఆర్జీఎంఆ ల్‌రౌండ్ చాంపియన్ కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్ తెలిపారు.
పాణ్యం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజలులుగా జరుగుతున్న 13వ జేఎన్‌టీయూఏ అంతర్ కళాశాలల క్రీడలు సోమవారం ముగిశాయి. ఆర్జీఎంఆ ల్‌రౌండ్ చాంపియన్ కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్ తెలిపారు. పురుషుల పుట్‌బాల్ విభాగంలో ఆర్జీఎం విన్నర్‌గా, తిరుపతి ఎస్‌వీఈసీ రన్నర్‌గా నిలిచాయి, బాస్కెట్‌బాల్ ఎన్‌బీకేఆర్ తిరుపతి విన్నర్, ఆర్జీఎం రన్నర్, బాల్‌బ్యాడ్మింటన్ శాంతిరాం విన్నర్, ఎన్‌బీకేఆర్ రన్నర్, టేబుల్ టెన్నిస్ సింగిల్స్ జేఎన్‌టీయూఏ విన్నర్, ఎన్ బికేఆర్ రన్నర్, టేబుల్ టెన్నిస్ డబుల్స్ జేఎన్‌టీయూఏ విన్నర్, ఎన్‌బీకేఆర్ వాకాడు రన్నర్, హ్యాండ్‌బాల్ జేఎన్‌టీయూ పులివెందుల విన్నర్, ఆర్జీఎం రన్నర్, కబడ్డీ ఆర్జీఎం విన్నర్, ఎన్‌బీకేఆర్ రన్నర్, బ్యాడ్మింటన్ సింగల్స్ ఏసీఈఎం ఆదిత్య మదనపల్లి విన్నర్, ఎస్‌వీసీఈ తిరుపతి రన్నర్, వాలీబాల్ పిబిఆర్ కావలి విన్నర్, విశ్వం మదనపల్లె రన్నర్‌గా నిలిచాయన్నారు, మహిళా విభాగంలో వాలీబాల్‌లో ఎస్‌వీఈసీ తిరుపతి విన్నర్, జేఎన్ టీయూఏ రన్నర్, బాల్‌బ్యాడ్మింటన్ ఎన్‌బీకేఆర్ విన్నర్, శాంతిరాం రన్నర్, బాస్కెట్‌బాల్ ఆర్జీఎం విన్నర్, పీవీఆర్ కావలి రన్నర్, త్రోబాల్ ఆర్జీఎం విన్నర్, జేఎన్‌టీయూ తిరుపతి రన్నర్, రగ్బీ ఆర్జీఎం విన్నర్, ఎన్‌బీకేఆర్ రన్నర్, టేబుల్ టెన్నీస్ సింగిల్స్ జేఎన్ టీయూఏ విన్నర్, ఎన్‌బీకేఆర్ రన్నర్, టేబుల్ టెన్నీస్ డబుల్స్ జేఎన్ టీయూఏ విన్నర్, కేయంయం తిరుపతి రన్నర్, బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌వీఈసీ తిరు పతి విన్నర్, జేఎన్‌టీయూఏ రన్నర్, హ్యాండ్‌బాల్ ఆర్జీఎం విన్నర్, ఎన్‌బీకేఆర్ రన్నర్ తిరుపతి నిలిచినట్లు తెలిపారు. క్రీడావిజేతలకు జేఎన్‌టీయూఏ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్, డైరెక్టర్ అశోక్‌కుమార్ చేతుల మీదుగా స్పోర్ట్స్ కప్పులు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రవిశేఖర్, వెంకటేశ్వరరెడ్డి, పీడీలు వెంకటేశ్, చం ద్రారె డ్డి, వివిధ కళాశాలల పీడీలు, సిబ్బంది పాల్గొన్నారు.