Share News

బీసీల్లో జోష్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:07 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని టీడీపీ అఽధినేత, సీఎం చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

బీసీల్లో జోష్‌

స్థానిక సంస్థల్లో పెరగనున్న ప్రాతినిథ్యం

సగటున 28.18 శాతం రిజర్వేషన్‌

కూటమి పరంగా 34 శాతం

బలహీన వర్గాల్లో హర్షాతిరేకాలు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని టీడీపీ అఽధినేత, సీఎం చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గౌరవిస్తూనే స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ సిఫారుసులు ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. సగటున 28.18 శాతం రిజర్వేషన్లకు మంత్రివర్గం ఆమోదం తెలుపగా, టీడీపీ తరుపున 34శాతం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో నగరపాలక సంస్థ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలహీన వర్గాలకు జేజేలు పల కడంతో కూటమి నేతలు, కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో బీసీలకు దక్కే స్థానాలు ఎన్ని? వంటి వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఉన్న మేయర్‌, చైర్మన్లు, జడ్పీ టీసీలు, ఎంపీటీసీలు, పం చాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మొత్తం స్థానాల్లో బీసీలకు రాజ్యాంగ బద్ధంగా 28.18శాతం స్థానాలు దక్కితే, కూటమి పార్టీలు మరో ఆరు శాతం స్థానాలు బీసీలకు కేటాయిస్తారు. మొత్తం స్థానాల్లో 34 శాతం స్థానాల్లో బీసీలు బరిలో దిగనున్నారు. 2020-21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుకు లోబడి 24.15 శాతం బీసీలకు రిజర్వేషన్‌ కల్పించారు. ఫలితంగా స్థానిక పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, సుప్రీం కోర్టు సైతం హైకోర్టు తీర్పున సమర్థించింది. బీసీల్లో రాజకీయ చైతన్యం కల్పించాలనే లక్ష్యంగా సీఎం చంద్ర బాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మిశ్రా స్వతంత్ర కమిషన్‌ సిఫార్సులకు జైకొట్టిం ది. అదే క్రమంలో పార్టీ పరంగా అండగా నిలుస్తామని భరోసా కల్పిచింది.

టీడీపీ ఆవిర్భావంతోనే..

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీల్లో రాజకీయ చైతన్యం పెల్లుబికింది. 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వం మండలిక వ్యవస్థను తీసుకొచ్చింది. 1985లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా బీసీలకు 20 శాతం రిజర్వేషన్‌ ఎన్టీఆర్‌ కల్పించారు. సరికొత్త రాజకీయ చైతన్యానికి బీజం వేశారు. అప్పటి వరకు జెండా మోసిన ఎందరో బీసీలు మండలాధీశులుగా, సర్పంచులుగా, జడ్పీ చైర్మన్లుగా బాధ్యతలు చేప ట్టారు.1987లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లను 24శాతానికి పెంచింది.

2020-21లో జరిగిన స్థానిక ఎన్నికల్లో..

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం-1994 సవరణ ద్వారా 1995లో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. దాదాపు 25 ఏళ్లు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం స్థానాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ వచ్చారు. 2020-21లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి సీఎం జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ 24 శాతానికి తగ్గించింది. బీసీలకు రాజకీయంగా తీరని అన్యా యం జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీసీ రిజర్వేషన్లు 34 శాతం అమలు చేయలేని పరిస్థితి ఉంది. రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ కూటమి బీసీలకు జై కొట్టడం బలహీనవర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఉమ్మడి జిల్లాలో 54 మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాలు న్నాయి. 54 జడ్పీటీసీ స్థానాలు, 809 ఎంపీటీసీ స్థానాలు, 973 గ్రామ పంచాయతీలు ఉ న్నాయి. మిశ్రా కమిషన్‌ సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్‌ అమలు చేస్తే మొత్తం స్థానాల్లో 1,890 వివిధ రాజకీయ పదవుల్లో 504 పదవులు రాజ్యాంగబద్ధంగా, మరో 143 స్థానాలకు పైగా కూటమి పార్టీలు అదనంగా సీట్లు ఇవ్వడం ద్వారా వివిధ హోదాల్లో 647 మందికి పైగా బీసీలకు రాజకీయ పదవులు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేష కుల అంచనా. అదే 2021లో వైసీపీ అమలు చేసిన 24 శాతం రిజర్వేషన్‌ ప్రకారమైతే 454 పదవులతో సరిపుచ్చుకోవాల్సి వచ్చేది. అదే జరిగి ఉంటే 193 మంది బీసీ నాయకులు స్థానిక పాలనకు దూరమయ్యేవారని విశ్లేషిస్తున్నారు.

జిల్లాల వారీగా బీసీలకు రిజర్వేషన్లు ఇలా ఉండవచ్చని విశ్లేషకుల అంచనా

స్థానిక సంస్థలు మొత్తం రిజర్వేషన్‌ కేటాయించే కూటమి ఇచ్చే బీసీలకు దక్కే

స్థానాలు శాతం స్థానాలు స్థానాలు మొత్తం స్థానాలు

కర్నూలు జిల్లా:

పంచాయతీ సర్పంచ్‌లు 484 27.95 135 30 165

జడ్పీటీసీలు 26 24.60 6 3 9

ఎంపీపీలు 26 24.60 6 3 9

ఎంపీటీసీలు 432 25.55 110 39 149

మొత్తం 968 -- 257 75 332

నంద్యాల జిల్లా:

గ్రామ పంచాయతీలు 489 27.95 137 30 167

జడ్పీటీసీలు 28 24.60 7 3 10

ఎంపీపీలు 28 24.60 7 3 10

ఎంపీటీసీలు 377 25.55 96 32 128

మొత్తం 922 -- 247 68 315

నగర, పురపాలికల్లో బీసీలకు 32.78 శాతం రిజర్వేషన్ల మేరకు వారికి కేటాయించే స్థానాలు ఇలా ఉండవచ్చని విశ్లేషకుల అంచనా

నగర/పురపాలికలు మొత్తం కేటాయించే

వార్డులు స్థానాలు

కర్నూలు 68 22

ఆదోని 52 17

ఎమ్మిగనూరు 44 15

గూడూరు 23 8

మొత్తం 187 62

Updated Date - Oct 12 , 2026 | 12:07 AM