Share News

అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలోకి చేరికలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:13 AM

అభివృద్ది, సంక్షేమాన్ని చేసి నగరంలోని పలు వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలోకి చేరికలు
టీడీపీలో చేరిన వారితో మంత్రి టీజీ భరత

మంత్రి టీజీ భరత

కర్నూలు అర్బన, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): అభివృద్ది, సంక్షేమాన్ని చేసి నగరంలోని పలు వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం మంగళగిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నగరంలోని 18 వ వార్డుకు చెందిన మాజీ కార్పొరేటర్‌ పల్లవి, తన అనుచరులతో కలిసి వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి మాట్లాడుతూ అభి వృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతు న్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో ప్రేమకాంత, మురళీ మెహన, విజ య్‌కుమార్‌, ప్రతాప్‌, బాబీ, మహాలక్ష్మి ఉన్నారు. న్యాయవాది గణేష్‌సింగ్‌, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, ఆవేజ్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:13 AM