వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:34 AM
మండలంలోని దక్షిణకొట్టాలు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు
రుద్రవరం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దక్షిణకొట్టాలు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు. నాగార్జున, మనోహర్, బాలనరసింహులు, టి.కొట్టా గ్రామానికి చెందిన గురప్ప, జయన్న పాములేటిలకు ఎమేల్యే కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు. క్రిష్ణారెడ్డి, నాగిరెడ్డి నాగ నర్సింహారెడ్డి, సర్వారెడ్డి, నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ అభివృద్ధే లక్ష్యం
ఆళ్లగడ్డ నియోజకవర్గ అభవృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం దక్షిణకొట్టాలు గ్రామంలో పంచాయతీ భవనం, సీసీ రోడ్లను ప్రారంభించారు. రెండేళ్లలో మండలంలో రూ.4.59 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎనిమిది ఆరోగ్య కేంద్రాలను రూ.3.18కోట్లతో నిర్మించామన్నారు. పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టరు రాజకుమారికి విన్నవించగా, కల్వర్టు నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరు చేశామన్నారు. డి.కొట్టాలులో 30లక్షలతో సీసీ రోడ్డు రూ.32లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించామన్నారు. 17వ తెలుగు గంగ బ్లాక్ ఛానల్‌ను డి.కొట్టాల గ్రామానికి భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి తెప్పించి ఫ్యాక్షన్ దూరం చేశారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రూ.2.5 కోట్లతో బీటీ రోడ్డు, నిర్మించానన్నారు. టీడీపీ కన్వీనర్ ఎల్‌వీ రంగనాయకులు, భూమిరెడ్డి వెంకటక్రిష్ణారెడ్డి, వీరలక్ష్మి దంపతులు, నాగిరెడ్డి, పుల్లారెడ్డి, మనోహర్‌రెడ్డి, మాజీసర్పంచ్‌లు చంద్రమోహన్, నారాయణరెడ్డి, కుళాయిరెడ్డి, రామనాధరెడ్డి, సర్వారెడ్డి, నాగనరసింహారెడ్డి, సత్యంరాజు, వెంకటపతి, కాంట్రాక్టర్ నాగేశ్వరరెడ్డి, తహసీల్దారు నాగవీణ, ఎంపీడీవో భభాగ్యలక్ష్మి, ఏవో సుమతి, ఏపీవో గౌరిబాయి, డీఈ వెంకటరెడ్డి, ఏఈలు కమాల్‌సాహెబ్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు