జాబ్‌మేళాలో 60 మందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:43 PM
పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా లో 60 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 300 మంది నిరుగ్యోలు పాల్గొనగా, 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యలు నిర్వహించారు
ఆళ్లగడ్డ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా లో 60 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 300 మంది నిరుగ్యోలు పాల్గొనగా, 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యలు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యలమంలో ఎమ్మెల్యే ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.
పేదరిక నిర్మూలనకే పీ4
పేదరిక నిర్మూలనకే ప్రభుత్వం పీ4 కార్యక్రమం తీసుకువచ్చింనది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నూర్జహాన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 936 మంది మార్గదర్శులు 9,133 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక అధికారి శ్రీధర్‌రెడ్డి వివిధ ప్రాంతాల ఎంపిడిఓలు, తాహసీల్దార్‌లు పాల్గొన్నారు.