ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:51 PM
ప్రతి ఏడాది ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె , మార్చి 20 (ఆఽంధ్రజ్యోతి): ప్రతి ఏడాది ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మిట్టపల్లెలో రూ.26లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును, మిట్టపల్లెలో రూ. 13.5లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని, కాపులపల్లెలో రూ.26లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. మంత్రికి సీనియర్ టీడీపీ నాయకుడు మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. మంత్రి బీసీ మాట్లాడుతూ మిట్టపల్లె, కాపులపల్లె గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత తనదన్నారు. పరిశ్రమలు రాకుండా కోర్టులను ఆశ్రయిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయ డానికి వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మఽధుసూధన్, ఏఈ సాయికృష్ణ, పెద్దిరెడ్డి, మద్దిలేటిరెడ్డి, ఉపసర్పంచ్ హైమావతి, రామసుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, మహానందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.