ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:08 AM
రాష్ట్రంలోని నిరుద్యోగ యువ తకు కూటమి ప్రభుత్వం ఉగాది పండగను పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణ మ్మ పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
ఆదోని, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువ తకు కూటమి ప్రభుత్వం ఉగాది పండగను పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణ మ్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆదోనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిరు ద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా పారదర్శకమైన రీతిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 20 నెలల స్వల్పకాలంలోనే 6,28,347 మందికి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించిందని వివరించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా 2,48,906 జాబ్ ఫెయిర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 1,46,627, పరి శ్రమల రంగంలో 95,174 లబ్ధి చేకూరిందన్నారు. పరాభవ నామ సంవ త్సర కానుకగా ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో పరిపాలన విభాగంలో గ్రూప్-1, గ్రూప్-2 కింద 600 పోస్టులు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పచ్చజెండా ఊపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బెస్త కార్పొరషన్ డైరెక్టర్ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ మాధవ, మురళి, గుడిసె శ్రీరాములు, మారుతి పాల్గొన్నారు.