నేటి నుంచి జేఈఈ-మెయిన్స్ ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్షలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:31 PM
బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్ష బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో కర్నూలు, ఆదోనిలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్ష బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో జేఈఈ-మెయిన్స్ పరీక్షలు కొనసాగున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో బీటెక్ సీట్ల ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 28, 29 తేదీల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష కొనసాగనున్నాయి. ఈ పరీక్ష ఉదయం షిప్టు 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిప్టు 3నుంచి సాయంత్ర 6గంటల వరకు కొనసాగుతాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లోనూ, ఆదోని బీమా ఇంజనీరింగ్ కళశాలలో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్వాహకులు నిర్ణయించిన సమ యం కంటే రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఏదైనా సమస్యను నివృత్తి చేసుకోవడానికి 91-11-40759000 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడు చేసిన అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వెంట తీసుకెళ్లాలి. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు ఫొటో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, 12వ తరగతి అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంది.