Share News

జలదుర్గం.. మురికి కూపం

ABN , Publish Date - May 14 , 2026 | 12:40 AM

మండలంలోని జలదుర్గం గ్రామం మురికి కూపంగా మారింది. రహదారి పక్కన, కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో దాదాపు 1,500 కుటుంబాలుండగా, 8 వేలకు పైగా జనాభా ఉంది.

జలదుర్గం.. మురికి కూపం
కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం

విధులను బహిష్కరించిన పారిశుధ్య సిబ్బంది

ప్యాపిలి, మే 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జలదుర్గం గ్రామం మురికి కూపంగా మారింది. రహదారి పక్కన, కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో దాదాపు 1,500 కుటుంబాలుండగా, 8 వేలకు పైగా జనాభా ఉంది. గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వ్యవహారం రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. దర్గా దారికి విగ్రహం అడ్డంగా ఉందని పక్కకు తొలగించాలని ఓ వర్గం, విగ్రహం ఉన్న ప్రాంతంలోనే ఉంచాలని మరో వర్గం పట్టుపట్టడంతో వివాదంగా మారింది. అధికారులు పలుమార్లు ఇరువర్గాలతో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఓ వర్గానికి చెందిన కార్మికులు విధులను బహిష్కరించారు. 15 రోజులుగా పారిశుధ్య పనులు చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిచాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్య కోర్టులో ఉంది

జలదుర్గంలోని అంబేద్కర్‌ విగ్రహ వివాదంపై ఇరువర్గాల వారు కోర్టుకు వెళ్లారు. ఓ వర్గానికి చెందిన పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించడం వాస్తవం. ఇతర పంచాయతీ కార్మికులచే పారిశుధ్య పనులు చేయిస్తాం. - శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి, ప్యాపిలి

Updated Date - May 14 , 2026 | 12:40 AM