Share News

జయహో భారత్‌..

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:25 AM

టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు విజయ దుందుభి మోగించింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌ సాగిం ది.

జయహో భారత్‌..
కర్నూలు నగరంలో యువత విజయోత్సాహం

టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు విజయ దుందుభి మోగించింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌ సాగిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్దపెద్ద స్ర్కీన్లు, టీవీలు పెట్టి మరీ మ్యాచ్‌ను తిల కించారు. ప్రతిఒక్కరూ మ్యాచ్‌ను వీక్షించడంలో లీనమయ్యారు. యువ భారతం వీర విహారం చేసింది. ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి మనవీరులు చాంపి యన్లుగా నిలిచారు. మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించ గానే ప్రజలు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకు న్నారు. యువత బైక్‌లు వేసుకొని తిరుగుతూ సందడి చేసింది. జయహో భారత్‌ అంటూ నినాదాలు చేశారు. - కర్నూలు స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 09 , 2026 | 12:25 AM