Share News

జగన్‌ పాపాలే శాపాలు

ABN , Publish Date - May 26 , 2026 | 11:18 PM

వైఎస్‌ జగన్‌ చేసిన పాపాలే ఆయనకు శాపాలయ్యాయని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

జగన్‌ పాపాలే శాపాలు
సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యే

ఆయన కలలు నిజం కావు

మంత్రులు ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి

నంద్యాల రూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : వైఎస్‌ జగన్‌ చేసిన పాపాలే ఆయనకు శాపాలయ్యాయని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డితో కలిసి మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ గతంలో జగన్‌ చేసిన హత్యలు ఆయనకు శాపాలుగా మారాయని అన్నారు. క్రూరత్వంలో రాజారెడ్డి డీఎన్‌ఎ జగన్‌లో ఉం దన్నారు. మంత్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రక్త చరిత వైఎస్‌ కుటుంబం ఇంటి పేరుగా మారిపోయిందని అన్నారు. అధికారంలో ఉన్న కాలంలో తన సొంత బాబాయిని చంపిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని జగన్‌ కలలు కంటున్నారని, ఆయన కలలు కలలుగానే మిగిలిపోతాయని మంత్రులు ఎద్దేవా చేశారు. వైసీపీ ఆరాచకాలను ప్రజలు భరించలేక 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారని గౌరు చరిత అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:18 PM