Share News

గ్యాస్‌ సరఫరాపై జగన్‌ అసత్య ప్రచారం

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:31 PM

రాష్ట్రంలో గ్యాస్‌ సరఫరా సరిగా లేదని వైఎస్‌ జగన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

గ్యాస్‌ సరఫరాపై జగన్‌ అసత్య ప్రచారం

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

క ర్నూలు, అర్బన్‌ మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్యాస్‌ సరఫరా సరిగా లేదని వైఎస్‌ జగన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యుద్ధవాతావరణం అలుముకుంటే.. బెంగుళూరు ప్యాలెస్‌ నుంచి జగన్‌ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో అంతరాయం వచ్చిందన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా అనవసరంగా చంద్రబాబుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:31 PM