Share News

జగన్‌ కల నిజం కాదు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:32 PM

సిద్ధం సిద్ధించదని.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కల నిజంకాదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పష్టం చేశారు.

జగన్‌ కల నిజం కాదు
మాట్లాడుతున్న మంత్రులు

అసెంబ్లీకి రండి..అఽభివృద్ధిపై చర్చిద్దాం

మంత్రులు బీసీ, ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : సిద్ధం సిద్ధించదని.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కల నిజంకాదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పష్టం చేశారు. మంగళవారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా కావాలంటూ గగ్గోలు పెట్టే జగన్‌ ఆ హోదా ఎలా వస్తుందో తెలియని రీతిలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ రోడ్డెక్కి అరుస్తున్న జగన్‌కు వాటి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలియదని అన్నారు. అభివృద్ధిపై చర్చ జరగాలంటే అసెంబ్లీకి రావాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులైన 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గోరుకల్లు జలశయాన్ని ప్రస్తుతం మరింత బలోపేతం చేస్తూ రూ. 53 కోట్లతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. రిజర్వాయర్‌లో లీకేజీల నివారణ కోసం రూ.54 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. అలగనూరు రిజర్వాయర్‌కు సంబంధించి గతంలో ప్రతిపాదించిన మరమ్మతుల కంటే ప్రస్తుతం విస్తృత స్థాయిలో చేపడుతున్నామన్నారు. శ్రీశైలం, అలగనూరు, గోరుకల్లు తదితర ప్రాజెక్టుల మరమ్మతుల, అభివృద్ధి కోసం రూ.610 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో అల్ర్టాటెక్‌ సిమెంట్‌ రెండో యూనిట్‌ సుమారు రూ.4వేల కోట్లతో కొలిమిగుండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా 860 అడుగులు చేరుకున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 04 , 2026 | 11:32 PM