వాస్తవాలు చెబితే జగన్‌కు ఉలికిపాటు: ఎమ్మెల్యే బీవీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:55 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వాస్తవాలను చెబితే వైసీపీ అధినేత జగన్ ఉలికి పడుతున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు.
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వాస్తవాలను చెబితే వైసీపీ అధినేత జగన్ ఉలికి పడుతున్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సాక్షాత్తు అసెంబ్లీలో మహిళలపైన, వారి కుటుం బాలపైన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను జగన్ మరచి నట్లున్నారన్నారు. గౌరవ సభను కౌరవసభ గా మార్చి పాలన సాగించారని మండిప డ్డారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను నానా హింసలు పెట్టార న్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర చేపడితే రైతులు భోజనం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా బూటుకాలుతో తన్నిన ఘటనలను వైసీపీ నాయకులు విస్మరించారన్నారు. జగన్ పత్రిక, చానెల్‌ను అడ్డం పెట్టుకుని తిమ్మిని బమ్మిని చేసి నానా యాగీ చేస్తున్నార న్నారు. అధికారంలోకి వస్తే అంతు చూస్తానని, తేలుస్తానని జగన్ మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను తట్టుకోలేకనే ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారన్నారు.