జగన జైలుకెళ్లక తప్పదు: ఎమ్మెల్యే కోట్ల
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:36 AM
మాజీ సీఎం జగన జైలుకెళ్లక తప్పదని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అన్నారు.
ప్యాపిలి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన జైలుకెళ్లక తప్పదని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక టీడీపీ కార్యాల యంలో రూ.11లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబును వైసీపీ నాయకులు దూషించడం వెనుక మాజీ సీఎం జగన హస్తం ముందని ఆరోపించారు. డోనలో కోట్ల, కేఈ కుటుంబాలు తప్ప ఎవరు అభివృద్ధి చేయ లేదన్నారు. అంతకుముందుగా ఎమ్మెల్యే మిషన ద్రోణాచార్య కార్యక్రమంలో భా గంగా మండలంలోని గుట్టలపల్లి, బూరుగుల, వంకమిట్టపల్లి, కౌలుపల్లి గ్రామా ల్లో పర్యటించారు. నీటి ఎద్దడి ఎదు ర్కొంటున్న గుట్టలపల్లి, వంకమిట్టపల్లి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో డోన మార్కెట్ యార్డు చైర్మన రాజా రేణుక, ప్రభాకర్‌రెడ్డి, వై లక్ష్మీనారాయణయాదవ్, టి శ్రీనివాసులు, ఆర్‌ఈ నాగరాజు, రామ్మో హనయాదవ్, ఖాజాపీర్, ప్రసాద్‌రెడ్డి, సుదర్శన పాల్గొన్నారు.