Share News

బీసీల ద్రోహి జగన్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:22 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీసీలను ఆణగదొక్కేందుకు కుట్రలు చేస్తూ.. బీసీల ద్రోహిగా మిగిలిపోయారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

బీసీల ద్రోహి జగన్‌
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బీసీలను ఆణగదొక్కేందుకు కుట్రలు చేస్తూ.. బీసీల ద్రోహిగా మిగిలిపోయారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శుక్ర వారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు, టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీ్‌షగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24శాతానికి కుదించడంతో బీసీలు దాదాపు 16800 మంది పదవులు రాకుండా కోల్పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే .. ఓర్వలేక వైసీపీ హైకోర్టును ఆశ్రయించి రిజర్వేషన్లను అడ్డుకుందని, తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. వైసీపీ అంటేనే.. ఆంఽధ్రప్రదేశ్‌ అభివృద్ధి నిరోధక పార్టీ అని లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌ గౌడ్‌ అన్నారు. బీసీలను వైసీపీ అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు విక్రమ్‌ సింగ్‌, ఎల్వీ ప్రసాద్‌, ఎల్లప్ప, సత్రం రామకృష్ణుడు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:22 PM