Share News

జగనకు మతి భ్రమించింది

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:20 AM

జగనకు మతిభ్రమించిందని, అందుకే రాజధానిపై పూటకోమాట మాట్లాడుతున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు.

జగనకు మతి భ్రమించింది
మాట్లాడుతున్న గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): జగనకు మతిభ్రమించిందని, అందుకే రాజధానిపై పూటకోమాట మాట్లాడుతున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. శనివారం మాధవినగర్‌లో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఏపీకి రాజధాని లేకుండా చేయడమే జగన ఏకైక అజెండాగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతే, నేడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు జగన అనేకసార్లు శంకుస్థాపన చేశారని, అయితే ఒక్క పైసా ఖర్చు చే యలేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణ పనుల్లో వైసీపీ నేతలు భారీగా కమీషన్లు దండుకున్నారని గౌరు చరిత విమర్శించారు. ఓర్వకల్లు టీడీపీ మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నన్నూరు సింగిల్‌ విండో చైర్మన నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:20 AM