Share News

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:17 PM

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించి హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్‌ రెడ్డి దెబ్బతీశాడని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ఆరోపించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్‌
వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుభ్రం చేస్తున్న నాయకులు

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించి హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్‌ రెడ్డి దెబ్బతీశాడని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ఆరోపించారు. గురువారం కర్నూలు నగరంలోని కేసీ కెనాల్‌ సమీపంలోని వినాయకుడి ఆల యంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఆలయ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై సిట్‌ నివేదిక ప్రకారం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన పీఏలను వెంటనే అరెస్టు చేయా లని డిమాండ్‌ చేశారు. రసాయనిక పదార్థాలు కలిపి కల్తీ నెయ్యిని తయారు చేసి లడ్డూ ప్రసాదంలో వినియోగంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇతర మతానికి చెందిన వైఎస్‌ జగన్‌ తిరుపతిలో డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా ఆలయాన్ని ఎలా సందర్శిస్తారని ప్రశ్నిం చారు. పవిత్రమైన ఆలయంలో బ్రాహ్మణ, వైశ్యులపై దాడులు చేశారని, దర్శనం టికెట్లు కూడా బ్లాక్‌లో అమ్ముకుని కోట్లు గడించారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై. నాగేశ్వరరావు, ఈ కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్ర మ్‌సింగ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు రవికు మార్‌, కార్పొరేషన్ల డైరెక్టర్లు సంజీవలక్ష్మి, ధరూర్‌ జేమ్స్‌, మనోజ్‌, ఆనంద రావు, కార్పొరేటర్లు జకీయా అక్సారీ, పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, పరమేష్‌, సుంకన్న, రాజశేఖరరెడ్డి, సత్రం రామ కృష్ణుడు, ఏసన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వెంకట రమణ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నగర కమిటీ నాయకులు శుద్ధి చేశారు.

Updated Date - Jan 29 , 2026 | 11:17 PM