సీమకు క్యాన్సర్ గడ్డలా మారిన జగన్
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:17 PM
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు ఓ క్యాన్సర్ గడ్డలా మారారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
జలాశయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు
ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు రూరల్, 3 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు ఓ క్యాన్సర్ గడ్డలా మారారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం కలుగొట్ల గ్రామంలోని కొండమ్మ చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని కోల్పోయి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారిపోయిందని అన్నారు. పోతిరెడ్డిపాడు దగ్గరకు వెళ్లి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను కూటమి నాయకులు ఆపారని, దీని వల్ల రాయలసీమకు తీవ్రమైన నష్టం జరుగుతుందని అసత్య ప్రచారాలు చేసున్నారన్నారు. వాస్తవానికి రాయల సీమ ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాదన్నారు. ప్రస్తుతం రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలా డుతున్నా యన్నారు. వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన ప్రాజెక్టులను మళ్లీ కొనసాగిం చిన ఘనత నారా చంద్రబాబునాయుడుదే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల టీడీపీ అధ్యక్షుడు కె.టి వెంకటేశ్వర్లు, కడిమెట్ల, నందవరం, సోగనూరు సొసైటీ అధ్యక్షుడు విరుపాక్షిరెడ్డి, ధర్మాపురం గోపాల్, గౌస్‌పీరా, మాధవరావ్‌దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.