Share News

మహిళలకు విలువ ఇవ్వని జగన్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:46 PM

మహిళలకు కనీస విలువ కూడా ఇవ్వలేని జగన్‌ రాజకీయాల్లో ఉండేందుకు అనర్హుడని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.

మహిళలకు విలువ ఇవ్వని జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మహిళలకు కనీస విలువ కూడా ఇవ్వలేని జగన్‌ రాజకీయాల్లో ఉండేందుకు అనర్హుడని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. ఆస్తి పంపకాల్లో తల్లి,చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ ప్రజలకు ఏమి మేలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఎమ్మిగనూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, బాబాయి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వారికి న్యాయపరంగా ఆస్తులను ఇవ్వకుండా జగన్‌ ఒక్కడే దౌర్జన్యంగా లాక్కున్నాడని ఆరోపించారు. మహిళల ఆస్థిహక్కును కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఇది కేవలం జగన్‌ రెడ్డి కుటుంబానికే కాదని రాష్ట్ర ప్రజల సమస్యగా భావించాల్సి ఉందన్నారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ రూ. 43వేల కోట్లు ఆస్తులు సంపాదించినప్పుడు తల్లికి, చెల్లికి ఎందుకు వాటా ఇవ్వటం లేదన్నారు. ఆస్తి హక్కు చట్టం కాపాడాలంటే మహిళలందరు జగన్‌ను నిలదీయాలన్నారు. తండ్రి సీఎం అయ్యాక అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్‌ రూ.వేల కోట్లు సంపాదించాడన్నారు. జగన్‌ అక్రమ సంపాదనపై సీబీఐ కేసు నమోదు చేఐసి చార్జీషీటు దాఖలు చేసిందని గుర్తుచేశారు.

Updated Date - Mar 23 , 2026 | 11:46 PM