Share News

తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన జగన్‌: మంత్రి బీసీ

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:09 PM

తల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్యాయం చేశారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన జగన్‌: మంత్రి బీసీ
ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తల్లి విజయమ్మకు, చెల్లి షర్మిలకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్యాయం చేశారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం రాత్రి పలుకూరు గ్రామంలో పలు ప్రారంభోత్సవాల్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, గుండం మల్లికార్జునరెడ్డి, చల్లా మద్దిలేటి ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. కిలోమీటరు మేర టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత దివంగత మాజీ సీఎం ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.98 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు, రూ. కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలన విధ్వంస పాలన అన్నారు. నకిలీ లడ్డుతో హిందువుల మనోభావాలను వైసీపీ నాయకులు దెబ్బతీశారన్నారు. దేశచరిత్రలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణాపురం శంకర్‌, వల్లెపు శంకర్‌, ఆదవేని రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:09 PM