Share News

తగ్గేదేలే..

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:36 PM

వైసీపీ హయాంలో ఆరుగురు రైతులు భూమిలో పైపులు వేసుకొని అక్రమంగా సాగు నీటిని తరలించుకుపోయారు.

తగ్గేదేలే..
ఒంటెడుదిన్నె గ్రామంలో జీడీపీ కుడి కాలువ నుంచి జలచౌర్యం కోసం అక్రమంగా ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌ పనులు

కూటమి నేతల అండతో జలచౌర్యం

జీడీపీ కుడి కాలువ నుంచి నీటి చౌర్యానికి ఎత్తులు

ఒంటెడుదిన్నెలో అక్రమంగా భూమిలో పైపులైన్లు

వైసీపీ హయాంలో ఆరుగురే..

తాజాగా 31 మంది రైతులు

చోద్యం చూస్తున్న జలవనరుల శాఖ అధికారులు

వైసీపీ హయాంలో ఆరుగురు రైతులు భూమిలో పైపులు వేసుకొని అక్రమంగా సాగు నీటిని తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తామేమి తక్కువ కాదని, తగ్గేదేలే అంటూ అధికార పార్టీ ఓ ముఖ్య నాయకుడి అండతో ఏకంగా 31మంది రైతులు భూమిలో పైపులు వేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు చోద్యం కళ్లకు గంతలు కట్టుకు న్నారనే ఆరోపణలున్నాయి. అంకురంలోనే ఆడ్డుకోకపోతే కుడి కాలువ పరిధిలోని దిగువ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. వైసీపీ హయాంలో వేసిన పైపులను కూడా తొలగించాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కర్నూలు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు కుడికాలువ (రైట్‌ కెనాల్‌) ఎగువ గ్రామాల రైతులు కూటమి నేతల అండతో జలచౌర్యానికి సిద్ధమవుతున్నారు. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం సమీపంలో 4.5టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1971లో గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మించారు. ఈప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పరిధిలోని 21గ్రామాలకు 25,454 ఎకరాలు రబీ ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇక్కడి నుంచే డోన్‌, కృష్ణగిరి, బండగట్టు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు ద్వారా డోన్‌ పట్టణం సహా వివిధ పల్లెలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎమ్మిగనూరుకి కూ డా ఇక్కడి నుంచి తాగునీటి సరఫరా కోసం పైపులైన్‌ పనులు చేపట్టారు.

సాగునీరు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం..

జీడీపీ కుడి కాలువ ద్వారా 19గ్రామాలకు 19వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కోడుమూరు, దేవనకొండ, కృష్ణగిరి, గోనెగండ్ల మండలాలకు చెందిన బోదేపాడు, కున్నూరు, లింగందిన్నె, రామకృష్ణాపురం, పోతుగల్లు, మనేకుంట, గోరం ట్ల, కొత్తపల్లి, గోకులపాడు, తూగడచెరువు, ఎర్రగుడి, కృష్ణాపురం, కృష్ణగిరి గ్రామాలకు సాగునీరు అందక ఆయకట్టు భూ ముల్లో సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జలాశయానికి సమీపంలోనే గోనెగండ్ల మండలం ఒంటెడు దిన్నె గ్రామం ఉం ది. ఒంటెడుదిన్నె, ఎర్రబాడు గ్రామాల్లో కుడి కాలువ కింద సు మారుగా రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. వైసీపీ హ యాంలో ఒంటెడుదిన్నెకు చెందిన ఆరుగురు రైతులు భూమి లో అక్రమంగా పైపులు వేసుకొని మూడేళ్లుగా జలచౌర్యానికి పాల్పడుతు న్నారనే ఆరోపణులున్నాయి.

31 మంది రైతులు..

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అంతా తానై చక్రం తిప్పుతున్న కూటమి పార్టీ ముఖ్య నేత అండతో మరో 31మంది రైతులు కుడి కాలువ నుంచి దాదాపు రెండు కిలో మీటర్లు దూరంలో ఉన్న తమ పొలాలకు అక్రమం గా నీటిని తరిలించుకెళ్లడానికి భూమిలో పైపులైన్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. పొలాల నుంచి పైపులను కా లువ గట్టు వరకు ఏర్పాటుచేసి, కాలువలో మోటార్లు అ మర్చి భారీఎత్తున జలచౌర్యానికి పక్కాగా ఎత్తులు వేస్తున్నారు. ఒక్కోక్క పైపు ద్వారా 4-5క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయవచ్చని ఓఇంజనీరు పేర్కొనడం కొసమెరుపు. అంటే.. 31 సబ్మెర్సిబుల్‌ మోటార్లు ఏకకాలంలో ఆన్‌ చేస్తే ఎంత తక్కువ కాదన్నా 100-120 క్యూసెక్కులు ఎత్తిపోసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

విచారణ చేస్తున్నాం

జీడీపీ కుడి కాలువ నుంచి నీటికి మళ్లించుకోవడానికి అక్రమంగా పైపులు వేస్తున్నారనే సమాచా రం వచ్చింది. దీనిపై ఏఈఈ పంపి విచారణ చే యించాం. రైతుల పొలాల్లో పైపులు నిర్మాణ పను లు చేస్తుండడంతో వాటిని అడ్డుకునే అధికారం మా కు లేదు. కాలువ గట్టుపైన, కాలువ భూముల్లో పైపులు ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. జల చౌర్యం జరగకుండా చర్యలు తీసుకుంటాం.

శైలేశ్వర్‌, ఈఈ, టీబీపీ ఎల్లెల్సీ, ఆదోని

Updated Date - Apr 19 , 2026 | 11:36 PM