‘సీమ’కు న్యాయం చేసింది చంద్రబాబే
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:48 PM
రాయలసీమకు న్యాయం చేసింది సీఎం నారా చంద్రబాబు నాయుడే అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు న్యాయం చేసింది సీఎం నారా చంద్రబాబు నాయుడే అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయ్రంత్రం రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, మంత్రి బీసీ సొంత నిధులు రూ.10లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును మాజీ సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, వరలక్ష్మి దంపతులతో కలసి మంత్రి ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను మంత్రి పంపిణీ చేశారు. గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి బీసీ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పింఛన్లు, ఉచిత బస్సు, తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేశారన్నారు. లక్ష ఎకరాల్లో హార్టికల్చర్ హబ్ చేస్తున్నామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రావాలని మరోసారి వైసీపీ నాయకులకు మంత్రి సవాల్ విసిరారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, జహంగీర్, గుండంమల్లిఖార్జునరెడ్డి, వల్లెపుశంకర్, గణమద్దిలేటి, మీరాపురం బాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆర్‌సీ నాగిరెడ్డి రామకృష్ణాపురం శంకర్, కోడూరు రామచంద్రారెడ్డి, భీముడు, కృష్ణాననాయక్ అధికసంఖ్యలో టీడీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు..
ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుం చి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈసందర్భంగా మంత్రి పలు అర్జీలను స్వయంగా సంబంఽధిత అధికారులకు ఫోన్‌లు చేసి పరిష్కరించారు.