Share News

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:17 AM

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా స్వర్ణ గ్రామ అధికారి టీవీ భాస్కర్‌ నాయుడు అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి
సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా స్వర్ణ, గ్రామ అధికారి టీవీ భాస్కర్‌ నాయుడు

ఓర్వకల్లు, జూలై 2(ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా స్వర్ణ గ్రామ అధికారి టీవీ భాస్కర్‌ నాయుడు అన్నారు. గురువారం మండలంలోని శకునాల, బ్రాహ్మణపల్లె, కాల్వ, హుశేనాపురం, ఓర్వకల్లు, నన్నూరు స్వర్ణ గ్రామ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నామని అందు లో స్వర్ణ గ్రామ సిబ్బంది కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కాల్వ గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనలో భాగంగా ఇంట్లో నిరు పయోగంగా ఉన్న వస్తువులను స్వచ్ఛరథం బండికి అందజేసి వారికి అవసరమైన వస్తువులను పొందాలన్నారు. మండల స్వర్ణ గ్రామ అధికారి సుధీర్‌, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:17 AM