Share News

బాల్యం గుర్తుకొస్తోంది

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:24 AM

knl news

బాల్యం గుర్తుకొస్తోంది
మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థినులతో పాటు క్యూలైన్‌లో నిలబడిన కలెక్టర్‌ రాజకుమారి

విద్యపై పెట్టుబడే పిల్లలకు నిజమైన ఆస్తి

స్పష్టమైన లక్ష్యం, కష్టపడే తత్వంతోనే విజయం

మెగా పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లో కలెక్టర్‌ రాజకుమారి గణియ

నందికొట్కూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ‘‘మా గ్రామంలో 30 కుటంబాలు ఉండేవి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను కూడా జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలోనే చదువుకు న్నాను.. రెండు జెడలు వేసుకొని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిను లను చూస్తుంటే నాకు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని’’ కలెక్టర్‌ రాజకుమారి గణియ అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదలతోనే కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. శుక్రవారం నందికొట్కూరు జడ్పీ హైస్కూల్‌ ప్లస్‌ బాలికల పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లా డుతూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ఆడపిల్లల కోసం బంగారం కూడబెట్టడం కంటే విద్యపై పెట్టుబడి పెట్టడం ఉత్తమమని అన్నారు.

ఫ పీఎంశ్రీ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లను త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాలని, పాఠశాల ప్రహరీ బలోపేతా నికి చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ అనుసంధానం 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం ప్లేట్‌ తీసుకొని విద్యార్థులతో కలిసి లైన్‌లో నిలబడి మధ్యాహ్న భోజనం అన్నం వడ్డించు కున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రామిరెడ్డి, ఎస్‌.ఐ. చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:26 AM