ఏటా ఇంటి పన్ను పెంచడం తగదు
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:03 AM
అద్దె విలువలపై 5 ఏళ్లకు ఒకసారి ఇంటి పన్ను పెంచే విధానాన్ని రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావశంలో వక్తలు డిమాండ్ చేశారు
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అద్దె విలువలపై 5 ఏళ్లకు ఒకసారి ఇంటి పన్ను పెంచే విధానాన్ని రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఏటా ఇంటి పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వెంకటేశ్వర కళ్యాణమండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్వర్యంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రైవేటు విద్యాంస్థల రాష్ట్ర ప్రతినిధి సి. పుల్లయ్య, సీనియర్ న్యాయవాది సి. నాగేంద్రనాథ్, రైస్‌మిల్ అసోసియేషన్ నాయకులు ఎం. సురే్‌షరెడ్డి, మాజీ కార్పొరేటర్ బాలరాజు హాజరయ్యారు. లక్షల రూపాయలు నగర పాలక సంస్థకు చెల్లించి నిర్మించుకున్న ఇంటికి ఏటా 15 శాతం పన్ను పెంచుకుంటూపోతే పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గత ఐదేళ్లలో 100 శాతం ఇంటి పన్ను పెరిగిన కొన్ని కాలనీలలో కనీసం రోడ్డు కూడ వేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కృష్ణమూర్తి, మైనార్టీ నాయకులు ఎస్. సమీద్, ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు వాసుదేవయ్య, న్యాయవాది, చంద్రశేఖర్, ఎం. నాగరాజు, ఏ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.