Share News

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:39 PM

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మెహన్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం
మాట్లాడుతున్న మాజీ కేంద్ర మంత్రి చింతా మెహన్‌

మాజీ కేంద్ర మంత్రి చింతా మెహన్‌

కర్నూలు అర్బన్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఖాయమని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మెహన్‌ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ నుంచి వచ్చిన బృందం స్థానిక నాయకులతో విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అమరావతి, మావిగన్‌ లతో ఎన్నికలకు పోతామని చెప్పడం హస్యాస్పదమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలోకి వెళ్తామని తెలిపారు. రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి రాగానే దళిత, క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తాం.. రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ స్టేటస్‌ ఇస్తాం. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి గణేష్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మస్తాన్‌ వళీ, నాగమధు యాదవ్‌, డీసీసీ అధ్యక్షులు క్రాంతి నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:39 PM