Share News

వారంలోపు సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:37 PM

జిల్లాలో ఒకే వ్యక్తి పలుమార్లు సమర్పించిన ప్రజా వినతులను ప్రత్యేకంగా గుర్తించి ఆయా పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలను వారంలోపు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.ఎ. సిరి అధికారులను ఆదేశించారు.

వారంలోపు సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్‌
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకే వ్యక్తి పలుమార్లు సమర్పించిన ప్రజా వినతులను ప్రత్యేకంగా గుర్తించి ఆయా పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలను వారంలోపు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.ఎ. సిరి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సాధారణ సమస్యలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులను కూడా స్వీకరించారు. కలెక్టర్‌ మాటా ్లడుతూ రానున్న శుక్రవారం సాయంత్రం నాటికి ప్రతి శాఖ అధికారి తమ శాఖ పరిధిలో ఎంత మంది పిటిషనర్లతో మాట్లాడారు?, ఎన్ని విన తులు పరిష్కరించారు?, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పరిష్కరించలేని అంశాలకు గల కారణాలేంటి? అనే పూర్తి వివరాలతో కార్యాచరణ నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రత్యేక నివేదిక నమూ నాను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:37 PM