రైతులకు పంట రుణాలు సులువుగా ఇవ్వండి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:21 AM
రైతులకు పంట రరుఆలను సులువుగా ఇవ్వాలని కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. గురువారం ఛాంబర్‌లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
సహకార బ్యాంకు అధికారులకు కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశం
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంట రరుఆలను సులువుగా ఇవ్వాలని కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. గురువారం ఛాంబర్‌లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. పొదుపు గ్రూపులకు 9 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలోని 43 ప్రైమరీ అగ్రికల్చర్, క్రెడిట్ సొసైటీలను పూర్తిస్థాయిలో కంప్యూటీకరణ చేశారా అని అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. బ్యాంకు సీఈవో రామాంజనే యులు మాట్లాడుతూ జిల్లాలోని 43 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు, ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ పూర్తి చేశామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో మాత్రమే తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని, పొదుపు మహిళలకు రూ.20లక్షల దాకా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. నాబార్డు మేనేజర్ సుబ్బారెడ్డి, డీసీవో వెంకటకృష్ణ, చీఫ్ మేనేజర్ అపర్ణ, ఆప్కాబ్ మేనేజర్ రంగనాథ్, ఫ్యాక్స్ సీఈవోలు దేవకుమార్, హరినాథరెడ్డి, హరీ్‌ఫబాషా పాల్గొన్నారు.
స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం ముందంజ..
జిల్లా స్థూల ఉత్పత్తి సాధించడంలో వ్యవసాయ శాఖ పురోగతి సాదించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. మిగిలిన విభాగాలు కూడా మార్చిలోపులక్ష్యాన్ని సాదించేచాలన్నారు. కలెక్టరేట్ మీనీ కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, జీడీడీపీ, కీలక పనితీరు సూచికలు ఏపీఎ్‌సఎ్‌ఫఎల్, ఏపీఎ్‌సపీడీసీఎల్, పర్యాటకం, పెట్టుబడులు, ఫుడ్ ప్రాసిసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం స్వర్ణాంధ్ర-మన సంకల్పం విజన్ 2047 క్యాలెండర్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
కుష్ఠు నిర్మూలనకు సమష్టి కృషి
కర్నూలు కలెక్టరేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుష్ఠు నిర్మూలనకు సమష్టిగా కృషిచేయాలని, ఇందులో భాగంగా ‘స్పర్శ’ లెఫ్రసీ అవగాహన కార్యక్రమాన్ని సమర్దవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో స్పర్శ లెఫ్రసీ అవగాహన కార్యక్రమం కరపత్రాలను వైద్యాధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులకు మహాత్మా గాంధీ చేసిన సేవలకు గౌరవ సూచకంగా ఆయన వర్ధంతి జనవరి 30న ప్రతి సంవత్సరం యాంటీ లెప్రసీ ఢేగా ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం వివక్షతను అంతం చేయడం-గౌరవాన్ని కాపాడుదాం అనే థీమ్‌తో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.భాస్కర్, డీసీహెచ్‌ఎ్‌స డా.జి.మల్లికార్జున రెడ్డి, డీపీఎంవో డా.జఫ్రుల్లా, టీ.చంద్రశేఖర్ రెడ్డి, వై.సుబ్రహ్మన్యం తదితర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.