అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:17 AM
ఉమ్మడి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను డోన్ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు.
రూ.14,01,500, కారు, 45 లీటర్ల సారా స్వాధీనం
అదుపులో ముగ్గురు నిందితులు, ఒకరు పరారీ
డోన్ టౌన్/నంద్యాల క్రైం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను డోన్ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్పీ సునీల్ షెరాన్, డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్, పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, సీసీఎస్ నంద్యాల ఇన్స్‌పెక్టర్ పి.సురేష్ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ దొంగలను పట్టుకునేందుకు డోన్, నంద్యాల పోలీసులతో పాటు సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బుధవారం వేకువజాబున సుమారు 3.30 గంటలకు ఐటీసీ సిగరెట్ గోడౌన్‌లో సిగరెట్ల చోరీ కేసును చేధించిన పోలీసులు, ముగ్గురు నిందితులను పట్టణ శివార్లలోని గుత్తిరోడ్డు రుద్రాక్ష గుట్ట వద్ద ఉదయం 8.30 గంటలకు అరెస్టు చేశారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేశారని, వీరు రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించామన్నారు. గత ఏప్రిల్ 20న ఐటీసీ సిగరెట్ గోడౌన్‌లో భారీగా కార్టన్లను అపహరించారన్నారు. వీటిని హైదరాబాదులో విక్రయించి నగదును వారి వద్దనే ఉంచుకున్నారు. అలాగే కడప పట్టణంలో కూడా ఇదే తరహా నలుగురు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.
360తో గుర్తింపు
ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీసులు, నంద్యాల సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ 360 వ్యవస్థలో నమోదైన దృశ్యాలను విశ్లేషించి అనుమానితుల కదళికలను గుర్తించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో డోన్ - గుత్తి రహదారిలోని రుద్రాక్ష గుట్ట సమీపంలో సంచరిస్తున్న మారుతీ సిఫ్ట్ కారును గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇటీవల వినియోగిస్తున్న సీసీ టీవీ 360 యాప్ అత్యాధునిక సాంకేతికత సహాయంతో నిందితులను వేగంగా గుర్తించగలు గుతున్నారు.
నిందితులు వీరే
లక్ష్మణ్‌రావ్ కుమావత్(45), తండ్రి చంగన్ రాంజీ కుమావత్ హపాట్ అలియాస్ హాస్పాట్ గ్రామం, సోజత్‌తాలుకా, పాళీ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. ఈ నిందితునిపై కామిరెడ్డి, నక్రేకల్ నల్లగొండ, బీదర్‌హుమ్నాబాద్, కర్ణాటక, మహబూబ్ నగర్ టూటౌన్‌లో, సైబరాబాదు అమంగల్, వనపర్తి పీఎస్, వనపర్తి రూరల్,వరంగల్ సిటీ కాకతీయ యూనివర్సిటీ క్యాంప్‌సలలో పలు కేసులు ఉన్నాయన్నారు.
గన్‌శ్యాం అలియాస్ గన్‌పత్ (45) తండ్రి బాగ్దా రాంజీ, బంజకూరి గ్రామం, జైతరన్ తాలుకా, పాళీ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. సికింద్రాబాదులోని రాచకొండ పోలీ్‌సస్టేషన్‌లో జడ్చెర్ల పీఎ్‌సలో, సికింద్రాబాదు మార్కెట్ పీఎ్‌సలో, సికింద్రాబాబు రాచకొండ పీఎ్‌సలో కేసులు ఉన్నాయన్నారు.
మానక్ చంద్ కుమావత్(35) తండ్రి బుద్దారాం, కుమావత్, బీరోల్ గ్రామం, జైతరన్ తాలుకా, పాళీ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. ఈ నిందితునిపై హైదరాబాదు సిటీలో ఒక కేసు, సైబరాబాదు మియాపూర్ పీఎస్, మెడ్చల్, జడ్చర్ల, లాంగర్ హౌస్, హైదరాబాదు, రాచకొండ పీఎ్‌సలో పలు కేసులు ఉన్నాయనీ పోలీసులు తెలిపారు.
కాగా మరో నిందితుడు పరారిలో ఉన్నాడనీ త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 14,01,500, కారు 45 లీటర్ల సారాను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు ఛేదనలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి. సురేష్ కుమార్, డోన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. ఇంతియాజ్ బాష, ఎస్‌ఐలు శరత్ కుమార్ రెడ్డి, ఎం.నరేంద్ర కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు బి.నాగరాజు, కే.సీతారామయ్య, ఎస్.హరి, ఈ.రాము, ఎన్.రాము, గురునాథ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్స్ షేక్ ఇబ్రహీం, షేక్ మాలిక్, కే.వెంకటేశ్వరుల, కే.నాగరాజు, ఏ.గంగారావు, పి.కృష్ణమ నాయుడులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.