Share News

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్టు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:15 AM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ వడ్డెపిట్ల గంగాఽధర్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు మరో 10 తులాల బంగారును కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని డోన్‌ డీఎ్ప శ్రీనివాస్‌ తెలిపారు.

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ అరెస్టు
దొంగ అరెస్టు చూపుతున్న డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ ప్రవీణ్‌కుమార్‌

10 తులాల బంగారు, నగదు స్వాధీనం : డీఎస్పీ

బనగానపల్లె, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగ వడ్డెపిట్ల గంగాఽధర్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు మరో 10 తులాల బంగారును కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని డోన్‌ డీఎ్ప శ్రీనివాస్‌ తెలిపారు. బనగానపల్లె పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌ శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ గంగాధర్‌ పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారు, నగదును దోచుకుంటున్నాడని అన్నారు. బనగనపల్లె పట్టణంలోని విద్యుత్‌ కార్యాలయం సమీపంలోని ఓంశాంతి నగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాఽఽఽధ్యాయుడు దూదేకుల నాగరాజు ఇంటి తాళాలు పగలకొట్టి గత ఏడాది నవంబరులో 20 తులాల బంగారు నగదు దోచుకొని పారిపోయినట్లు తెలిపారు. ఇతనిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. ముద్దాయికి చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:15 AM