Share News

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - May 21 , 2026 | 10:53 PM

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమ య్యాయి. భానుడి భగభగ మండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

భానుడి భగభగలు

ఇక్కట్లు పడ్డ విద్యార్థులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమ య్యాయి. భానుడి భగభగ మండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం సెషన్‌ 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర, పట్టణ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు పడిన వేదన చెప్పనలవి కానివి. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌కు మొత్తం 25,798 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ప్రథమ సంవత్సరం 17,649 మంది కాగా, ద్వితీయ సంవ త్సరం 8,149 మంది విద్యార్థులున్నారు. జిల్లా వ్యాప్తంగా 57పరీక్ష కేంద్రాలను ఏర్పా టుచేశారు. మొదటి రోజు ఫస్టియర్‌ 4,441 మందికి గాను 4,214 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 227 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్‌ పరీక్షలకు 1858 మందికి గానూ 1,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 158 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో జి.లాలెప్ప పేర్కొ న్నారు. పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐవో, డీవీఈవో, డీఈసీ కమిటి సభ్యులు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ బృంధాలు తనికీలు చేశారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు.

Updated Date - May 21 , 2026 | 10:53 PM