Share News

‘పీఎంఎఫ్‌బీవై’కు నెలాఖరు వరకు గడువు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:30 AM

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై)లో సాగుచేసిన పంటలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెలా ఖరు వరకు గడువు పొడిగించింది. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పంటలను నమోదు చేసుకునేందుకు జూలై 31వ తేదీతో గడువు ముగి సింది.

‘పీఎంఎఫ్‌బీవై’కు నెలాఖరు వరకు గడువు
జిల్లాలో సాగుచేసిన మొక్కజొన్న

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై)లో సాగుచేసిన పంటలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెలా ఖరు వరకు గడువు పొడిగించింది. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పంటలను నమోదు చేసుకునేందుకు జూలై 31వ తేదీతో గడువు ముగి సింది. ప్రకృతి విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పంట నష్టానికి గుర వుతున్న రైతులను ఆదుకునేందుకు మరో బీమా పథకం పీఎంఎ్‌ఫబీవై . ఈ బీమాలో పంటలను బీమా చేయించేందుకు ఈనెలాఖరు వరకు అవకాశం కల్పించారు.

తక్కువ మొత్తంలో ప్రీమియం..

వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, ఎర్ర మిరప, కొర్ర, సజ్జలు, ఉల్లి పంటలకు పీఎంఎ్‌ఫబీవైలో తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించి బీమాలో చేరేందుకు అవకాశం కల్పించారు. వరికి ఎకరాకు కేవలం రూ.80 చెల్లిస్తే సరిపోతుంది. మొక్కజొ న్నకు రూ.66, కందులకు రూ.44లు, జొన్నకు రూ.38లు, ఆముదంకు రూ.36లు, ఎర్ర మిరపకు రూ.360, కొర్రకు రూ.32, సజ్జలకు రూ.32, ఉల్లికి రూ.90 మాత్రమే ఎకరా కు ఈ మొత్తం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వరికి గ్రామం యూనిట్‌గా ఒక ఎక రాలో సాగుచేసిన పంటకు రూ.40వేల బీమా మొత్తాన్ని నిర్ణయించారు. అదే విదంగా మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, ఎర్రమిరప పంటలకు మండల యూనిట్‌గా ఈపథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొర్ర, సజ్జలు, ఉల్లి పంటలకు జిల్లా యూనిట్‌గా నిర్ణయించి అమలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన..

మొక్కజొన్నకు రూ.33వేలు, కందులకు రూ.22వేలు, జొన్నకు రూ.19వేలు, ఆము దానికి రూ.18వేలు, ఎర్రమిరపకు పెద్దఎత్తున రూ.90వేలు, కొర్రకు రూ.16వేలు, సజ్జలకు రూ.16వేలు, ఉల్లికి రూ.45వేలను బీమా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈపథకంలో చేరేందుకు రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు బుక్కు, 1బీ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌, పంట సాగు ధ్రువీకరణ పత్రం వీటిని మీసేవా కేంద్రాలకు తీసుకెళ్లి సాగు చేసిన పంటలను బీమా చేయించేందుకు నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి.

రైతులంతా చేరాలి

పీఎంఎ్‌ఫబీవైతో ప్రకృతి వైపరీత్యాలు, అనుకొని నష్టాల నుంచి రైతులు రక్షణ పొందొచ్చు. నామమాత్రం ప్రీమియం చెల్లిస్తే చాలు. ప్రభుత్వం నిర్ణయించిన బీమా మొత్తం రైతుల బ్యాంకు అకౌంట్లకు చేరుతుంది. ఈ నెలాఖరు వరకు ఈ పథకంలో రైతులు సాగు చేసిన పంటలను నమోదు చేసుకోవచ్చు. రైతులంతా చేరాలి. - దస్తగిరిరెడ్డి, ఏడీఏ, కర్నూలు

Updated Date - Aug 09 , 2026 | 12:30 AM