Share News

పరిహారం చెల్లించిన ఇన్సూరెన్స్‌ కంపెనీ

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:18 AM

పత్తికొండలో పంచాయతీరాజ్‌లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్‌ శ్రీనివాసులు కుటుంబానికి రూ.1.24,12,507 నష్టపరిహారం చెక్కును జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అందజేశారు

పరిహారం చెల్లించిన ఇన్సూరెన్స్‌ కంపెనీ
బాదితులకు చెక్కు అందజేస్తున్న ప్రధాన న్యాయాధికారి కబర్ధిట

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారం

కర్నూలు లీగల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి):పత్తికొండలో పంచాయతీరాజ్‌లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్‌ శ్రీనివాసులు కుటుంబానికి రూ.1.24,12,507 నష్టపరిహారం చెక్కును జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి అందజేశారు. శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఈ నష్టపరిహారం చెల్లించడానికి న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ అంగీకరించింది. గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇంజనీర్‌ శ్రీనివాసులు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు వారి న్యాయవాది ఏ.శ్రీనివాస భట్‌ ద్వారా న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీపై నష్టపరిహారం కోసం కేసు దాఖలు చేశారు. ఈ కేసును సంప్రదింపుల ద్వారా పరస్పర అంగీకారంతో జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించేందుకు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, బాధితుల న్యాయవాది శ్రీనివాస్‌ భట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో చర్చించారు. ఇరు పక్షాలు రాజీ కావడంతో ఈ మొత్తం నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ అంగీకరించి లోక్‌ అదాలత్‌లో మృతుడి శ్రీనివాసుడి కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో చెల్లించింది.

Updated Date - Jul 12 , 2026 | 12:18 AM