Share News

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - May 23 , 2026 | 12:08 AM

పట్టణంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలపై విజిలెన్స్‌, వ్యవసాయ అధికారులు కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు
రికార్డులను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కోడుమూరు, మే 22(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలపై విజిలెన్స్‌, వ్యవసాయ అధికారులు కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ సీఐ పవన్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్‌ పట్టణంలోని కిసాన్‌మాల్‌, మన అగ్రిస్టోర్‌, కోరమండల్‌ పర్టిలైజర్స్‌ దుకాణాలపై దాడులు చేశారు. అగ్రి స్టోర్‌ దుకాణంలో యూరి యాకు ఈ పాస్‌ మిషన్‌లో నమోదు చేసిన యూరియాకు తేడా ను గమనించారు. దీంతో అమ్మకాలను నిలిపివేశారు. వాటికి సరైన బిల్లులు చూపించిన అనంతరం విక్రయాలు కొనసాగించాలని ఆదే శాలు జారీ చేశారు. కిసాన్‌మాల్‌లోని పత్తి విత్తనాలకు సంబం ధించిన దసా్త్రలు లేకపోవడం వలన సుమారు 200ప్యాకెట్ల అమ్మ కాలను నిలిపివేశారు. విజిలెన్స్‌ సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అందజేయా లని, దుకాణాల దగ్గర స్టాక్‌ వివరాలు, ధరల పట్టికను తప్పకుండా రైతులకు కడపడే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:08 AM