ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:45 PM
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో విజయనరసింహ, రైతుబజార్ లోపల వున్న వెంకటసుబ్బారెడ్డి మిల్స్ సెంటర్, మిల్క్‌డైరీలోని ఔట్‌లెట్‌లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పుడ్‌సేప్టీ అధికారులు వెంకటరాముడు, కాశీంవలి పాల్గొన్నారు.
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో విజయనరసింహ, రైతుబజార్ లోపల వున్న వెంకటసుబ్బారెడ్డి మిల్స్ సెంటర్, మిల్క్‌డైరీలోని ఔట్‌లెట్‌లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పుడ్‌సేప్టీ అధికారులు వెంకటరాముడు, కాశీంవలి పాల్గొన్నారు. వెంకటరాముడు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పాలను తనిఖీ చేశామన్నారు. ముందస్తుగా పాలలో కలర్స్, షుగర్, యూరియా, ఆయిల్స్ వంటి వాటిని స్టాచ్‌తో పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో పాలలో ఎటువంటి కల్తీలు లేవన్నారు. ఇంకా లోతుగా పరీక్షల కోసం కొన్ని శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించామన్నారు. మధ్యాహ్నం నుంచి బనగానపల్లెలో తనిఖీలు కొనసాగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.